ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటన.. సుప్రీంకు వెళ్లనున్న ఏపీ సర్కార్ !

-

ఆంధ్ర ప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు నిర్వహించడానికి ఏమాత్రం సుముఖంగా లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచి ఎన్నికలు నిర్వహించమని చెబుతూనే వస్తోంది. కానీ కొద్ది రోజుల క్రితం ఏప్రిల్ మే, నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మార్చి నెలలో రమేష్ కుమార్ పదవీకాలం పూర్తవుతుంది ఆయన పదవీ కాలం పూర్తి అయ్యాక ఎన్నికల ఉంటాయని ఆయన కామెంట్స్ ఉన్నాయంటూ నిన్న నిమగడ్డ మండిపడ్డారు.

నిన్న ప్రభుత్వ అధికారులతో భేటీ అనంతరం అప్పటికప్పుడు షెడ్యూల్ విడుదల చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అంటూ తేదీలతో సహా ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. తాజాగా ఈ నిర్ణయం మీద ఈరోజు సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించనుంది. ఎన్నికల కమిషన్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయాలి అనే కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తోంది ఇదే కారణం చేత ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news