మరికాసేపట్లో తూగో జిల్లాకు పవన్.. ఇదే షెడ్యూల్

దివీస్ పరిశ్రమ వద్దంటూ ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లా వెళుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుండి 8 గంటలకు రాజమండ్రికి వెళ్లనున్న ఆయన 9 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్ మార్గం ద్వారా ర్యాలీ గా తొండంగి సభకు జనసేనని వెళ్లనున్నారు. రెండుగంటలకు తొండంగి మండలం  కొత్తపాకలలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 

pawan kalyan
pawan kalyan

నిజానికి అంతకుముందు సభకు అనుమతి లేదని అంటూ నిలిపివేశారు. దీంతో జనసేన నేత నాదెళ్ళ మనోహర్ ఎస్పీకు ఘాటు లేఖ రాశారు. కొత్తపాకల పవన్ కళ్యాణ్ బహిరంగ   సభపై ఆంక్షలా? అంటే వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది., కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన సభకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరిస్తారా ? ఇలా ఇప్పుడు ప్రకటించడం అప్రజాస్వామికం అంటూ ఆయన లేఖలో రాసుకొచ్చారు.