అమరావతి : ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణకు కెబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. 300 కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లో శిక్షణ ఇవ్వనున్న మైక్రో సాఫ్ట్… 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది.
రూ. 30.79 కోట్ల తో మైక్రో సాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు ఏపీ కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించాలని కెబినెట్ ఆదేశించింది. ఆ భూముల్లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యజమాన్యానికి అనుమతి ఇచ్చింది. మైనార్టీ సబ్ ప్లానుకు ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు కెబినెట్ ఆమోదం తెలపగా.. కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగా వాట్లను కేటాయించనున్న ప్రభుత్వం… యూనిట్టుకు రూ. 2.49కు సరఫరా చేసేలా కెబినెట్ ఆమోదం తెలిపింది.