నేడు లోటస్ పాండ్ లో షర్మిల భేటీ..

తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందన్న వార్తలు జోరుగా వినిపించిన నేపథ్యంలో వైయస్ షర్మిల తాను పార్టీ పెడుతున్నానంటూ ప్రకటన ఇచ్చింది. తెలంగాణలో పార్టీ పెట్టడంపై అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల జూన్ 8వ తేదీన పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా సమావేశం జరగుతుంది. లోటస్ పాండ్ వేదికగా కార్యకర్తలతో షర్మిల భేటీ కానున్నారు. నేడు జరగనున్న ఈ సమావేశంలో పార్టీ ఆవిర్భావం రోజున జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడనున్నారు.

పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళే విషయాలతో పాటు గ్రామీణ అడహక్ ల ఏర్పాటు మొదలగు అంశాల గురించి మాట్లాడనున్నారు. షర్మిల పార్టీ పేరు వైయస్సార్ టీపీగా ఉండనుందని తెలుస్తుంది.యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీగా పేరు పెడుతున్నట్లు, ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసినట్లు సమాచారం. ఇక పార్టీ ఎన్నికల గుర్తుగా టేబుల్ ఫ్యాన్ వైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. మరి షర్మిల పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.