పోలవరం విచారణ నుంచి వైదొలిగిన ఏపీ హైకోర్టు సీజే

-

పోలవరం ప్రాజెక్టు విచారణ నుంచి ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు. తాను అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)గా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి పోలవరంపై న్యాయ సలహా ఇచ్చినందున ఈ వ్యాజ్యంపై విచారించడం భావ్యం కాదని తెలిపారు. ఇది మరో ధర్మాసనం ముందుకు వచ్చేలా చూడమని రిజిస్ట్రీని ఆదేశించారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు 2017లో దాఖలు చేసిన పిల్‌ విచారణ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వైదొలిగారు. 2013-14 నాటి అంచనా ధరల ప్రకారమే నిధులు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కేవీపీ ఈ పిల్‌లో కోరారు. ఇందులో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అనుబంధ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. విచారణకు ఆయన కూడా హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news