జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఇళ్ల పట్టాల’ పంపిణీ ఈరోజు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ ని నిన్న విచారించిన హైకోర్టు ఈ కార్యక్రమాన్ని ఆపలేమని పిటిషనర్ కు తేల్చి చెప్పింది. పిటిషనర్ పిటిషన్ లో వేసిన అన్ని అభ్యంతరాలను తోసి పుచ్చింది. దీంతో ఇళ్ళ పట్టాల పంపిణీకి మార్గం క్లియర్ అయింది. ఇక ఈరోజు 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కె.కొత్తపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. మిగతా చోట్ల మంత్రులు హాజరవుతారు. ఈ ఏడాది ఉగాది పర్వదినాన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ కరోనా, అలానే కోర్టు పిటిషన్ల కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చిందని చెప్పచ్చు. ఈరోజు కూడా కొన్ని చోట్ల పంపిణీ మీద స్టేలు ఉన్నాయి. అలా లేని ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు.