అమరావతి : ఏపీ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. పేదలకు సొంతిల్లు కట్టించాలనే సంకల్పంతో 31 లక్షల మందికి ఇళ్ళు ఇస్తున్నట్లు పేర్కొన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణం జరుగుతోందన్నారు . సీఎం జగన్ ఆలోచనా విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.
గృహనిర్మాణానికి నిధుల కొరత లేదని.. అధికారులు గృహనిర్మాణం ఒక బాధ్యతగా తీసుకోవాలని వెల్లడించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఈనెల 28న విశాఖలో లక్ష మందికి ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 28న రెండవ విడతగా1.5 లక్షల మహిళలకు ఇళ్ళ మంజూరు చేసినట్లు వెల్లడించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. పేదల ఇళ్ళపై కొందరు కోర్టులకు వెళ్ళారని.. దేవుడి ఆశీస్సులతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అందరికీ సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తారన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.