నా భర్త వైసీపీ నేత కాబట్టే పెళ్లి చేసుకున్నా.. లేకపోతే చేసుకునే దాన్నే కాదు.. ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి – వీడియో

-

ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన మంత్రి పుష్ప శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెళ్ళి, రాజకీయాల గురించి షాకింగ్ న్యూస్ చెప్పారు. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ తనకు వైఎస్సార్సీపీ పై ఉన్న అభిమానానికి ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు. అవును… తను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తను ఎందుకు పెళ్లి చేసుకున్నది.. ఎవరిని పెళ్ళిచేసున్నది లాంటి విషయాలను స్పష్టం చేశారు.

Ap minister Pushpa Sri vani sensational comments on her marriage

తన భర్తను కేవలం అతడు వైఎస్సార్సీపీ నాయకుడు కాబట్టే పెళ్లి చేసుకున్నారట. ఒకవేళ తన భర్త వైఎస్సార్సీపీ నాయకుడు కాకపోయి ఉంటే అతడిని అస్సలు పెళ్లి చేసుకోక పోయేవారట. తనకు వైఎస్సార్సీపీ అన్నా.. వైఎస్ జగన్ అన్నా ఎనలేని అభిమానం అట. అందుకే తను వైఎస్సార్సీపీ కి చెందిన నాయకుడినే వివాహం ఆడాలని అనుకున్నారట.

జగన్ అంటే తనకు దేవుడితో సమానమట. తనకు జగన్ అంటే అభిమానం అని తన భర్తకు పెళ్లి కాకముందే చెప్పారట. వైఎస్సార్సీపీ కి చెందిన నేత తన భర్త అయితే తను కూడా పార్టీలో కీలకంగా పని చేయొచ్చని భావించారట. తనకు చిన్నప్పటినుంచి రాజకీయాలంటే ఇష్టమట. ఆ ఇష్టమే ఇప్పుడు తనను ఏపీకి ఉప ముఖ్యమంత్రి ని చేయడంతో పాటు అతి చిన్న వయసులో మంత్రిని చేసింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news