సూపర్ స్టార్ కృష్ణ-విజయ నిర్మాల ధాంపత్య జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే . వాళ్లిద్దరి అన్యోయత గురించి వర్ణించడం అసాధ్యం. ఏ కార్యక్రమానికైనా జంటగా వెళ్లేవారు. విజయ నిర్మాల తోడు లేనిదే కృష్ణ ఇల్లు కదిలేవారు కాదు. ఆలుమగలిద్దరూ ఎంతో సంతోషంగా ఇండస్ర్టీలో జరిగే కార్యక్రమాలకు విచ్చేసారు. ఇక విజయ నిర్మల మరణంతో కృష్ణ ఎంత బాదపడ్డారో స్వయంగా చూసాం. ఆయనింకా షాక్ నుంచి కోలుకోలేదు. కంటికి రెప్పాలా కాపాడే అర్ధంగి లేదని కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటివరకూ కృష్ణ ఎప్పుడూ కన్నీరు పెట్టింది లేదని ఓ సీనియర్ పాత్రికేయుడు సైతం మీడియాకు వెల్లడించారు. కృష్ణ వయసు కూడా మీద పడింది.
ఈ సమయంలో ఎక్కువగా బాధ పడకూడదు. ఆందోళన చెందకూడదు. విశ్రాంతి లేకుండా ఉండకూడదు. వేళ ప్రకారం అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు సదరు పాత్రికేయుడు తెలిపారు. విజయ నిర్మాల జ్ఞాపకాల నుంచి ఎంత తొందగరా బయటపడితే అంత మంచింది. ఈ నేపథ్యంలో కృష్ణ ఒంటరిగా నానక్ రామాగూడ ఇంట్లో ఉంటారా? లేక మొదటి భార్య ఇందిరా దేవి, మహేష్ తల్లివద్దకు వెళ్తారా? అన్న ఓ ప్రశ్న తలేత్తింది. ఈ నేపథ్యంలో ఆ సీనియర్ పాత్రికేయులు ఇందిరా దేవిగారు కృష్ణను చూసుకునే పరిస్థితుల్లో లేరని, ఆమెను ఇంకొకరు చూసుకోవాల్సి వస్తుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు వద్ద ఉంటేనే కృష్ణ ఆరోగ్యంగా ఉంటాడరిని తెలిపారు. పైగా కృష్ణ మహేష్ మాట తప్ప ఇంకెవరి మాట వినరని…అందువల్ల మహేష్ దగ్గర ఉంటనే తొందరగా కోలుకుంటారని తెలిపారు. కృష్ణ ఆరోగ్యం కుదుట పడేవరకూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నారు. సదరు పాత్రికేయుడు వ్యాఖ్యలతో కృష్ణ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కృష్ణ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.