ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

-

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఒక ముఖ్య ఘట్టం పూర్తి అయింది. ఈరోజు కొద్ది సేపటి క్రితం నామినేషన్ ఉపసంహరించుకునే గడువు ముగిసింది. ఇక ఇప్పటికే వైసీపీ ఖాతాలో పుంగనూరు, మాచర్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు వార్డుల్లో 31 వార్డులు ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. ఇక మిగతా చోట్ల అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపీ కాంప్ లు పెట్టుకుంది.

చివరి నిమిషంలో వైసీపీ ప్రలోభాలకు తలొగ్గి అటు వెళ్లే పరిస్థితులు కనిపించడం తో టీడీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. నిన్న ఒక్కరోజే 222 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. ఇక ఏలూరులో 23వ డివిజన్ లో టీడీపీ తరుపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి విత్ డ్రా చేసుకోవడం తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. అలా విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ల డివిజన్ లలో జనసేన, బిజెపి పార్టీ అభ్యర్థులు ఉంటే వారి తరపున నేను ప్రచారంలో పాల్గొంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news