జగన్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. బాలినేని బుజ్జగించే పనిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉన్నారు. రెండు రోజలు వ్యవధిలో మూడు సార్లు బాలినేని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం బాలినేని పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. మరికాసేపట్లో బాలినేని సీఎం జగన్ తో భేటీ కానున్నారు. స్వయంగా సజ్జల, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు బాలినేనిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లనున్నారు. అంతకు ముందు విజయవాడలోని బాలినేని నివాసానికి సజ్జలతో పాటు శ్రీకాంత్ రెడ్డి, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, అనిల్, మాధవరావు లు వెళ్లారు.
ఇదిలా ఉంటే బాలినేనినికి మంత్రి పదవి రాలేదని తెలిసి ఆయన అనుచరులు, కార్యకర్తలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తమ నాయకుడికి లేని పదవులు తమకు వద్దని రాజీనామాలు చేస్తున్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో బాలినేని అనుచరులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. త్వరలోనే తమ నాయకుడు కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం చేస్తున్నారు.