ఇంట్లో మిగిలిపోయిన సబ్బు ముక్కలను అందరూ మహా అయితే కొత్తదానికి అట్టింకి వాడతారు. లేదా పారేస్తుంటారు.. ఇంకా కొంతమంది.. వాటిని నీళ్లలో వేసి బాత్రూమ్ లో వేస్తారు. మంచి వాసన వస్తుందని గృహిణులు ఇలా చేస్తుంటారు. కానీ వాటితో హెయిర్ రిమూవల్ సబ్బు తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా..? అవునండి.. మిగిలిపోయిన సబ్బుముక్కలతోనే.. హెయిర్ రిమూవల్ సోప్ చేసేయొచ్చు. చాలామంది హెయిర్ రిమూవల్ కోసం.. చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ట్రిమ్మింగ్ చేస్తే.. మరికొంతమది వ్యాక్సిన్ అంటారు.. ఇంకొంతమంది.. షేవింగ్ అంటారు. ఏవేవో క్రీమ్స్ రాసి అవాంఛితరోమాలను తొలగించుకుంటారు. రేజర్ ద్వారా హెయిర్ తీస్తే.. కొద్ది డేస్ కే మళ్లీ వచ్చి చిరాకుగా అనిపిస్తుంది. మరీ ఈరోజు మనం ఈ మిగిలిపోయిన సబ్బుముక్కలతో హెయిర్ రిమూవల్ సోప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా..!
కావాల్సిన పదార్థాలు..
సబ్బు ముక్కలు
బేరియం సల్ఫేట్ పొడి
పసుపు
ఎలా చేయాలంటే..
ముందుగా మిగిలిపోయిన సబ్బు ముక్కలను తీసుకోండి. వాక్స్ హీటర్ ఆన్ చేసి అందులో సబ్బు ముక్కలను వేయాలి. అది కరగడం స్టాట్ అయినప్పుడు.. టెంపరేచర్ తగ్గించండి, తద్వారా సబ్బు కరుగుతుంది. సబ్బు పూర్తిగా కరిగిన తర్వాత టేబుల్ స్పూన్ బేరియం సల్ఫేట్ పొడి ,చిటికెడు పసుపు యాడ్ చేయండి. కరిగిన సబ్బులో బేరియం సల్ఫేట్ పౌడర్ బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు దానిని ఏదైనా షేప్ బౌల్ లో నింపి ఆరనివ్వండి. హెయిర్ రిమూవల్ సోప్ రెడీ..
ఇలా వాడాలి..
ముందుగా మీ చర్మాన్ని నీటితో తేమ చేయాలి. ఆ తర్వాత సబ్బును అప్లై చేయండి. మీరు రుద్దుతున్నప్పుడు, జుట్టు నెమ్మదిగా రాలుతుంది. ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చు, కాబట్టి మీ సమయాన్ని వెచ్చించి రిలాక్స్డ్ పద్ధతిలో చేయండి. జుట్టు రాలినప్పుడు నీళ్లతో కడిగేయాలి. దీంతో చేతులు, కాళ్లు పొత్తికడుపు ప్రాంతాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని వాడే ముందు చర్మానికి క్రీములు, ఆయిల్స్ మొదలైన వాటిని వాడొద్దు. ప్రైవేట్ పార్ట్స్ ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ ఉపయోగించవద్దు. చర్మంపై పుండ్లు ఉంటే, ముందుగా దానిని నయం చేసి, ఆపై సబ్బును ఉపయోగించాలి.