ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు

-

కరోనా కారణంగా… 2021 విద్యా సంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. 2021 జూలైలో బోర్డు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన మరియు నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు వెల్లడించింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

హైపవర్ కమిటీ సిఫారసుల మేరకు రెగ్యులర్ విద్యార్థులు తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులను కూడా పాస్ చేసినట్లు విద్యాశాఖ ఉత్తర్వులో వెల్లడించింది. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పోర్టల్ లో లో అందుబాటులో ఉన్న వివరాల మేరకు పదవ తరగతి విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే పేద విద్యార్థులకు ఎస్ ఎస్ సి మార్కులపై 30 శాతం వెయిటేజీ మరియు సన్నద్ధత కోసం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్పులపై 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news