వరద నష్టంపై నేడు ఏపీకి కేంద్ర బృందం…

ఇటీవల కురిసిన వర్షాలతో ఏపీలో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా రాయలసీమలో నష్టం ఎక్కువగా ఉంది. చిత్తూర్, అనంతరపూర్, నెల్లూర్, కడప జిల్లాల్లో వరదలు భీభత్సం కలిగించాయి. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరదలు వర్షాల ధాటికి రోడ్లు, బ్రిజ్జిలు, విద్యుత్ లైన్లతో పాటు వరదల్లో వేల సంఖ్యలో మూగ జీవాలు మరణించాయి. దాదాపు 6 వేల కోట్ల రూపాయల నష్టం వాటల్లినట్లు ప్రభుత్వ ప్రాథమికంగా అంచనా వేసింది. తక్షణ సహాయం కింది రూ. 1000 కోట్లు ఇవ్వాలని ఇటీవల సీఎం జగన్, ప్రధాని మోదీని కోరారు.

ఇదిలా ఉంటే ఈ రోజు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచానా వేసేందుకు కేంద్ర బృందం ఏపీకి రానుంది. భారీగా నష్టపోయి చిత్తూర్, నెల్లూర్, కడప, అనంతపూర్ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. నష్టాన్ని అంచనా వేసేందుకు ఏడుగురు సభ్యులతో కేంద్రం ఈ బృందాన్ని నియమించిందని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమీషనర్ కన్నబాబు తెలిపారు. 3 రోజులు పర్యటించిన తర్వాత కేంద్ర బృందం సీఎం జగన్ తో సోమవారం సమావేశం కానున్నారు.