నిమ్మ వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు అని అందరికీ తెలుసు. అయితే నిమ్మ వలన లాభాలు కలుగుతాయి అని అతిగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి అని చాలా మందికి తెలియదు. అయితే ఎక్కువ నిమ్మని మనం తీసుకోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిమ్మలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. అయితే అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
పంటి సమస్యలు వస్తాయి:
నిమ్మ లో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ నిమ్మని తీసుకోవడం వల్ల అది పంటిపై ఉండే ఎనామిల్ ని తొలగిస్తుంది. అదే విధంగా పళ్ళు పుచ్చి పోవడం లాంటివి కలుగుతాయి. కాబట్టి అతిగా నిమ్మని తీసుకోవద్దు.
గుండెల్లో మంట వస్తుంది:
ఎక్కువ నిమ్మని తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి లిమిట్ గానే తీసుకోవాలి ఏదైనా అతిగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అని గ్రహించండి.
ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది:
నిమ్మలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలానే కార్డియోవాస్క్యులర్ సమస్యలు రాకుండా చూసుకుంటుంది కానీ అతిగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్యకి కూడా దారి తీస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా లిమిట్ గానే తీసుకోవడం మంచిది.
అల్సర్ల రిస్కు పెరుగుతుంది:
ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, గుండెలో మంట లాంటి సమస్యలు వస్తాయి. ఇలా అల్సర్లకి కూడా ఇది దారితీస్తుంది.
కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉంటుంది:
ఎక్కువగా దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ లో రాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అతిగా తీసుకోవద్దు.