ఏపీ సర్కార్ vs సినీ ఇండస్ట్రీ..మళ్ళీ వివాదం..

-

జగన్ సర్కార్ vs సినీ పరిశ్రమల మధ్య మళ్ళీ వివాదం మొదలైంది..టిక్కెట్ల ధరల పెంపు పై గత కొన్ని నెలల పాటు చర్చలు జరిగిన విషయం తెలిసిందే..ఈ మధ్యే జగన్ ప్రభుత్వం ఈ ఊరట కలిగించే విషయం చెప్పింది.ఇప్పుడు మరోసారి షాక్ ఇచ్చింది.టికెట్లను APFDC ద్వారా ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంభందించిన జీవో 69ను కూడా జూన్ 2న విడుదల చేసింది జగన్ సర్కార్.

ఈ మేరకు నెలరోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఎంవోయూ చూసి ఎగ్జిబిటర్లు కంగుతిన్నారు. టికెట్ల విక్రయం తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారో లేదో స్పష్టత రాలేదు..కాగా, ఈ విషయం పై ఎగ్జిబిటర్లు అభ్యంతరం తెలిపారు.

ఆన్లైన్ విక్రయాలు ఫిలిం ఛాంబర్ ద్వారా నిర్వహిస్తామని ఎగ్జిబిటర్లు కోరారు. కావాలంటే ప్రభుత్వానికి లింక్ ఇస్తామని ఎగ్జిబిటర్ల లేఖలో తెలిపారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ గేట్వే ద్వారానే టికెట్లు విక్రయించాలని జీవోలో పేర్కొన్నారు. అయితే, ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వ చేతుల్లో చిక్కినట్లేనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. జులై 2 లోపు సంతకం చేయకపోతే లైసెన్స్లు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనపై సీఎంకు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది..సంతకాలు చేసేది లేదని, థియేటర్లు మూసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పేశారు..మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news