కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ వరుస భేటీలు నిర్వహిస్తోంది. జిల్లాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో భేటీలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే డీజీపీ కూడా సమావేశం నిర్వహించారు. భౌగోళిక, ఆర్ధిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో కసరత్తులు జరుగుతున్నాయి. ఆదాయ వనరులతో కూడిన కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది. అందుబాటులో ఉన్న అధికారులు.. ఉద్యోగులు.. సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు వేస్తోంది.
అవసరమైన చోట అందుబాటులో ఉన్న ఉద్యోగులనే అప్ గ్రేడ్ చేసి బాధ్యతలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలంటే కొన్ని మండలాలను పునర్ వ్యవస్థీకరించాల్సి వస్తోందనే భావన వ్యక్తం అవుతోంది. వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. 26 జిల్లాలకే పరిమితం కావడం కష్టంతో కూడుకున్న వ్యవహరంగా ఉందని అధికారులు అంటున్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ జిల్లాల సంఖ్య పెరిగే ఛాన్స్ లేకపోలేదని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏమవుతుంది ? అనేది/