ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుండి అంటే ?

-

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌ ఏడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని,  అలానే పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది ఏడు పేపర్లు ఉంటాయని పేర్కొన్నారు. జూన్‌ 5వ తేదీ వరకు 10వ క్లాస్‌ తరగతులు జరగుతాయన్న ఆయన జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని అన్నారు. 

సైన్సులో రెండు పేపర్లు ఉంటాయని, జూన్‌ ఏడున ఫస్ట్‌ లాంగ్వేజ్‌.. ఎనిమిదిన సెకండ్‌ లాంగ్వేజ్‌, తొమ్మిదో తేదీన ఇంగ్లీష్‌ పరీక్ష ఉంటుందని అన్నారు.  ఇక 2021 విద్యా సంవత్సరం లో విద్యా వార్షిక ప్రణాళిక ను ఖరారు చేశామని అన్నారు. లాంగ్వేజెస్‌.. గ్రూప్స్‌కు 100 మార్కులు చొప్పున పేపర్లు ఉంటాయని, సైన్స్‌కు మాత్రం రెండు పేపర్లు ఉంటాయని అన్నారు.  50 మార్కులు చొప్పున రెండు పేపర్లు ఉంటాయని అన్నారు. జూన్ 7 తేదీన ప్రాథమిక భాష పరిక్ష, జూన్ 8న రెండో భాష పరీక్ష, జూన్ 9న ఇంగ్లీష్, జూన్ 10- మ్యాథ్స్‌, జూన్‌ 11- భౌతిక శాస్త్రం, జూన్‌ 12- జీవ శాస్త్రం, జూన్‌ 14 జూన్ సోషల్ స్టడీస్ ఉంటాయని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news