సాధారణంగా తామర గింజలు అంటే ఎవరికీ తెలియదు. కానీ ఫూల్ ముఖాన అంటే బాగా తెలుసు. దీనితో ఎన్నో రుచికరమైన రెసిపీస్ ని తయారు చేస్తూ ఉంటారు. ఉత్తర భారత దేశంలో అయితే వీటితో వంటలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎక్కువగా ఫుల్ మఖానా బీహార్ లో పండుతాయి. ఇవి ముదురు గోధుమ రంగులో లేదా తెలుపు రంగులో కూడా లభిస్తాయి. వీటిని పచ్చివి తిన్నా, వేయించుకు తిన్నా, ఉడకబెట్టి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఫూల్ మఖానా వల్ల నిజంగా అన్ని లాభాలు ఉన్నాయా అని అనుకుంటున్నారా…? అవును ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఫుల్ ముఖాన ద్వారా మనకి లభిస్తాయి. మరి ఆలస్యమెందుకు ఇక నా వల్ల కలిగే లాభాలు కోసం చూసేయండి.
ఎండిన వాటికంటే పచ్చి వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి మీ దరిచేరకుండా ఉంటాయి. ఔషధ గుణాలు కలిగిన ఫూల్ మఖానా లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలానే సోడియం దీనిలో తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎనీమియా, పిత్త, కఫ వైద్యంలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.
వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటి వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్యతో సతమతమయ్యేవారు తీసుకుంటే ఈ సమస్యను నివారిస్తుంది. రక్తహీనతకు గల రోగులకు ఇది ఔషధంలా పని చేస్తుంది. గర్భిణీలకు, బాలింతలకు అయితే బలవర్థకమైన ఆహారం ఇది. సోడియం తక్కువగా ఉండడం వల్ల బీపి వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తీసుకుంటే చాలా మంచిది. ఆకలి పెంచడానికి ఇది బాగా సహాయ పడుతుంది. డైట్ పాటించే వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంచి కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అనే చెప్పొచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది కాబట్టి షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.