ఉచిత శిక్షణ… దరఖాస్తుకు ఇదే చివరి తేది..!

-

బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చాలా మంది పోటీ పడుతుంటారు. మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత,ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువ సెలవులు ఉండడంతో పాటు పనిభారం కూడా ఎక్కువ ఉండకపోవడంతో చాలా మంది బ్యాంకు ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ స్టడీ సర్కిల్ శుభవార్త తెలిపింది. ఇండియన్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సర్వీసెస్‌ (ఐబీపీఎస్) పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఉచితంగా శిక్షణ (freeTraining) ఇస్తామని ఏపీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఉచితంగా శిక్షణ /freeTraining
ఉచితంగా శిక్షణ /freeTraining

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ప్రీ క్వాలిఫయింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ప్రీ క్వాలిఫయింగ్‌ టెస్ట్‌ లో అర్హత సాధించిన వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ప్రీ క్వాలిఫయింగ్‌ టెస్ట్‌ కోసం https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూలై 22 చివరి తేది కాగా… వార్షిక ఆదాయం రూ.6లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆగస్టు 1న ఆన్ లైన్ లో ప్రీ క్వాలిఫయింగ్‌ టెస్ట్‌ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news