AP: ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రకటించిన రిటర్నింగ్ అధికారి

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎన్డీయే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి సి. రామచంద్రయ్య, జనసేన నుంచి పి. హరిప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సి. రామచంద్రయ్య, పి. హరిప్రసాద్ ఎమ్మెల్సీలుగా సేవ అందించనున్నారు.

కాగా ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్టీయే కూటమి తరపున హరిప్రసాద్‌ను, సి.రామచంద్రయ్యను జులై 1న ప్రకటించారు. దీంతో వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో హరిప్రసాద్‌, సి.రామచంద్రయ్య ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తాజాగా ప్రకటించారు. దీంతో ఎన్టీయే ఖాతాలో 2 ఎమ్మెల్సీలు చేరాయి. అయితే గత ఎన్నికల్లో కూటమి మొత్తం 164 స్థానాలతో ఘన విజయం సాధించింది. వైసీపీ 11 చోట్ల మాత్రమే గెలిచింది. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీ బరిలో దిగలేదు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక తేలిక అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news