ఏపీ అసెంబ్లీకి ఇటీవల కొత్తగా ఎన్నికై తమవంతు బాధ్యత నిర్వహిస్తున్న కూటమి ఎమ్మెల్యేలకు మంగళవారం నుంచి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సోమవారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బుధవారానికి సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు సభలో ఎలా నడుచుకోవాలో శిక్షణ ఇప్పించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. సభలో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరును వివరించారు. సీఎం చంద్రబాబు శాసనసభ్యలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది.బడ్జెట్ పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు.ఇకపై కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.