చంద్రబాబు మోసాలు బయటపడతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు అని వివరించారు.
ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 12500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్ లో 5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి యాడాదికి 26000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్ లో ఆడబిడ్డ నిదికి బడ్జెట్ లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతి కి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏదాడికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్ లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తరువాత మమ్మలను అరెస్టు చేస్తారు, మేము దేనికైనా సిద్ధం. పోలీసులకు భయపడేది లేదు అని మాజీ మంత్రి గుడివాడ తెలిపారు.