ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టు తెలిపింది. తమిళనాడు వరకు పదిహేను వందల మీటర్ల దాకా ఉపరితల ద్రోణి ఏర్పడిందని స్పష్టం చేసింది. దానితో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది.
వాటి ప్రభావంతో రాబోయే 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా రెండు రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. అంతేకాకుండా భారీ వర్ష సూచన తో ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. ఇక భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.