బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్…!

-

ysrcp mla gangula bijendra reddy tested with corona positive
ysrcp mla gangula bijendra reddy tested with corona positive

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి, ముఖ్యమంత్రులు ఇద్దరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఎన్నో కఠిన నిబంధనలు పాటించే రాజకీయ నేతలను సెలబ్రిటీలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తెలంగాణ ఎమ్మెల్యే లను ఆంధ్ర ఎమ్మెల్యేలను సైతం ఈ మహమ్మారి కాటు వేసింది. తాజాగా నేడు ఏపీ లోని మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఇటీవలే టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఎమ్మెల్యేతో పాటుగా, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి అయన భార్యకు కూడా కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news