ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం ప్రాంతములో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడినది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియుమధ్య బంగాళాఖాతం వాయుగుండముగా బలపడుతుంది.

ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళా ఖా తం లో తుపాన్ గా మారుతుంది .ఇది తరువాత వాయువ్య దిశలో పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతం తీరమువరకు ప్రయాణించి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిస్సా తీరమునకుడిసెంబర్ 4వ తేదీకల్లా చేరవచ్చును . తరువాత ఈ తుపాన్ ఉత్తర ఈశాన్య దిశలో ప్రయాణించును. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా… ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.