వరంగల్ జెమిని ఏషియన్ థియేటర్ లో అగ్నిప్రమాదం… తప్పిన భారీ ప్రమాదం.

వరంగల్ లో భారీ ప్రమాదం తప్పింది. జెమిని ఏషియన్ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థియేటర్ అంతా పొగ కమ్ముకోవడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం థియేటర్ లోకి పవర్ సప్లైని నిలిపివేశారు.

వరంగల్ జెమిని ఏషియన్ సినిమా హాల్ లో కూలింగ్ మిషన్ లో పవర్ హీట్ కావడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను వెంటనే ఆర్పేశారు. దీంతో  ప్రమాదం తప్పింది. ఆ సమయంలో సినిమా హాల్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.

బాల కృష్ణ నటించిన అఖండ సినిమా చూస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో థియేటర్ లో 250 మంది సినిమా చూస్తున్నారు. మంటల సమయంలో పొగ నిండిపోవడంతో సినిమా చూస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు.