ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్..యథావిధిగా వైన్స్‌ ఓపెన్‌ !

-

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్..యథావిధిగా వైన్స్‌ ఓపెన్‌ గానే ఉండనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో యథావిధిగానే రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు పని చేయనున్నాయి. తమ బంద్ ని నిరవధిక వాయిదా వేసుకున్నారు ఏపి బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్. వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి లేఖ అందించారు ఏపి బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్ ప్రతినిధులు.

AP Wine Shops Bandh Decision Delayed Due to Floods

ఇక వారి సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్‌ రా ష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలోనే… వివిధ సోషల్ మీడియా వేదికల్లో మద్యం దుకాణాల బంద్ వార్తలు అవాస్తవమని, యధావిదిగానే పని చేస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news