కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని బాంబ్ పేల్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం చేసినట్లు ఇవాళ సాయంత్రం నుంచి వార్తలు వస్తున్నాయి. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రూ.3300 కోట్లు వచ్చాయన్నది పుకారు మాత్రమేనని తెలిపారు. మాకైతే ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. మేం ఇంకా ప్రాథమిక నివేదిక పంపలేదు, రేపు ఉదయం నష్టం అంచనా పై ప్రాథమిక నివేదిక పంపుతామని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. విజయవాడ కు భవిష్యత్ లో ముంపు కు గురవ్వకుండ చూస్తామని… దీనికోసం త్వరలో డిపిఆర్ సిద్ధం చేస్తామని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.