సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ”AP04 రామాపురం” మూవీ రివ్యూ

-

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, యస్ యస్ కుమార్ నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం”. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదలై..మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


కథ మరియు వివరణ :
రామాపురం లో డ్యూటీ చేసే ఇన్స్పెక్టర్ ఒక చెట్టుకు ఊరిసుకొని చనిపోతాడు. ఆ ఊరి జనం మాత్రం ఇది హత్య కాదు ఆత్మహత్య అంటారు. కానీ యస్. పి. ఆఫీస్ లో పోస్ట్ మార్టమ్ రిపోర్టులో మాత్రం ఇది హత్య అని తెలుస్తుంది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రామాపురంకి ఒక కొత్త ఎస్ఐ ( పి. యన్ రాజ్) ను అపాయింట్మెంట్ చేస్తారు .ఆ వ్యక్తి ఆ ఊరికి వచ్చి అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అదే రామాపురానికి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కేంద్రీయ వ్యవసాయాన్ని డెవలప్ చేసే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హీరో రామ్(రామ్ జక్కల) వస్తాడు.విలేజ్ డెవలప్మెంట్ లో భాగంగా ఆ ఊరిలో తిరుగుతున్న రామ్ కు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన అఖిల (అఖిల ఆకర్షణ) అనూహ్యంగా అక్కడ కనిపించడంతో షాక్ అయ్యి కొంత ఎమోషనల్ అవుతాడు. వీరిద్దరూ గతంలో లవ్ ప్రపోజ్ చేసుకునే రోజు హీరోయిన్ తన దగ్గర రాకుండా ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకొంటుంది తనెందుకు ఇలా చేసిందో అర్థం కానీ రామ్ కు అఖిల ఈ ఊర్లో కనిపించడం, తను కూడా ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ఊర్లో ఉండే కఠినమైన కట్టుబాట్లు అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరూ తల ఎత్తి చూడకూడదు అలా చూసిన వారికి వంద కొరడా దెబ్బలు తో పాటు ఊరి బహిష్కరణ అనే కట్టుబాట్లు ఉంటాయి.ఈ కారణంగా అఖిల, రామ్ కు ఏమీ చెప్పలేక పోతుంది.

ఇదిలా ఉండగా ఆ ఊరిలో చనిపోయిన వ్యక్తి గురించి యస్సై పి. యన్ రాజు ఆ ఊరిలో ప్రతి ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఆ ఊరి విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (VRO) కూడా అదే చెట్టుకు ఊరేసుకొని చనిపోతాడు. అయితే చని పోయిన VRO జేబులో లెటర్ ను గుర్తించగా అందులో నాకు షుగర్ ఉంది ఈ జబ్బు వళ్ళ ఈ ఊరి రైతులకు సరైన న్యాయం చేయలేక పోతున్నాను అందుకే చనిపోతున్నాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ ఆధారంగా ఇది కూడా ఆత్మ హత్యని నిర్దారిస్తారు. అయితే ఆ ఊరి సర్పంచ్ హీరోయిన్ ఫాదర్ ఈశ్వర్ రెడ్డి (ఎస్ఎస్ కుమార్)ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఆ ఎస్సై తో వాదిస్తాడు.ఆ ఎస్సై ఇది హత్య అని చెప్పే ప్రయత్నం చేయగా అందరూ ఆ ఎస్సై ను అనుమానిస్తారు. ఈ క్రమంలో హీరో రామ్ పై కూడా ఆటాక్ జరుగుతుంది. ఇది ఎవరు చేశారని తెలుసుకుంటుండగా మళ్ళీ ఆ ఊరి గ్రామ పంచాయతీ సెక్రెటరీ కూడా అదే చెట్టుకు ఉరివేసుకుని చనిపోతాడు.అయితే ఆ ఊరికి మంచి చేయడానికి వచ్చి ప్రతి ఒక్కరిపై అటాక్ జరగడం, లేక చనిపోవడం జరుగుతుంది.ఇలా ఆ ఊర్లో వరుసగా అదే చెట్టుకు ఊరేసుకొని ఎందుకు చనిపోతున్నారు? నిజంగా వారిని ఎవరైనా చంపుతున్నారా.. లేక వాళ్లకు వాళ్లే చని పోతున్నారా.. ఇలా ఆత్మహత్యలు జరగడానికి కారణం ఏమిటి? ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ ఊరిలో జరిగేవి హత్యలా లేక ఆత్మ హత్యలా..? ఆ ఇలాంటి కఠినమైన కట్టుబాట్లు ఎందుకు పెట్టారు.. ఇలాంటి తరుణంలో అఖిల, రామ్ లు ఎలా కలుసుకున్నారనే కథను తెలుసుకువాలంటే “AP 04 రామాపురం” సినిమా చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌
నటీనటుల నటన
దర్శకత్వం
కథ

రివ్యూ రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news