జగన్ సర్కార్ మరో రికార్డు

-

అనంతపురం: ఏపీ సర్కార్ మరో ఘనత సాధించింది. సంక్షేమ పథకాల వరదపారిస్తున్న సీఎం జగన్ మరో అడుగు ముందుకేశారు. కరోనా నేపథ్యంలో అనంతపురంలో తాత్కాలక కోవిడ్ ఆస్పత్రిని 15 రోజుల్లో నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో  యుద్ధప్రాతికన ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో 500 ఆక్సిజన్ పడకలు ఉంటాయి. రూ. 5.50 కోట్లతో 13.56 ఎకరాల్లో జర్మన్ హ్యాంగర్ విధానంలో ఈ ఆస్పత్రిని నిర్మించారు. రాయలసీమకు చెందిన కరోనా రోగులకు ఈ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రి లో కోవిడ్ హాస్పిటల్‌ను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆక్సిజన్ ఆధారంగా నిర్మించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఆస్పత్రిని వర్చువల్ ద్వారా ప్రారంభించారు. దీంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు అందుబాటులోకి మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ రానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news