పేలిన యాపిల్‌ వాచ్‌.. విషయం బయటకు చెప్పొందన్న కంపెనీ..!

-

స్మార్ట్‌ ఫ్లోన్లు పేలడం మనం వినే ఉంటాం.. తక్కువ ధర ఫోన్లు అలా అవుతాయనేది మన నమ్మకం.. యాపిల్‌ అంటే ఎంత పెద్ద బ్రాండో మనకు బాగా తెలుసు.. మరి అలాంటి కంపెనీ వాచ్ పేలితే.. పైగా వాచ్‌ పేలిక విషయం లీక్‌ చేయొద్దని కంపెనీ వినియోగదారుడిని కోరిందట.. అసలు ఏం జరిగిందంటే..

మీడియా అందిన సమాచారం ప్రకారం.. ఓవర్‌ హీట్‌ కారణంగానే ఆపిల్‌ వాచ్‌ పేలినట్టు వినియోగదారుడు చెబుతున్నారు. ఆపిల్‌ వాచ్‌ పేలిందన్న విషయాన్ని తెలుసుకున్న ఆపిల్‌ సంస్థ సపోర్ట్‌ టీం రంగంలోకి దిగింది. వినియోగదారునితో సంప్రదింపులు జరిపింది..పేలిన ఆ వాచ్‌ను ముట్టుకోవద్దని హెచ్చరించింది. అందులో పాదరసం ఉంటుందని దాని వల్ల చాలా ప్రమాదమని హితవు పలికింది. వాచ్‌ పేలిన సంగతిని ఎవరికీ చెప్పొద్దని ఆపిల్‌ కంపెనీ సూచించింది.

ఓ డాక్యుమెంట్‌ ఇచ్చి సైన్‌ చేయమని కూడా చెప్పింది. విషయాన్ని బహిరంగ పరచకుండా హామీ తీసుకునేందుకే ఆ పత్రంపై సంతకం తీసుకుంటున్నారేమో అన్న అనుమానంతో సంతకం చేసేందుకు వినియోగదారు నిరాకరించాడు. కంపెనీ తరఫున ఓ డాక్టర్‌ను కూడా నియమించింది. ఏదైనా సమస్య ఉంటే అతన్ని సంప్రదించాలని వినియోగదారునికి సలహా ఇచ్చింది కూడా. కానీ వాచ్‌ పెట్టుకున్న వ్యక్తి మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్‌ అవసరం లేదని చెప్పేశారు. అనంతరం ఆ వాచ్‌ను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు తీసుకెళ్లారు. కంపెనీ పికప్‌ టీం వచ్చి ఆ వాచ్‌ను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఓవర్‌ హీట్‌ అయితే ఫ్లోనే కాదు..వాచ్‌లు కూడా పేలుతాయి.. అది యాపిల్‌ అయినా సరే..చాలమంది ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌కు విపరీతంగా ఛార్జింగ్‌ పెడతారు. అయితే ఫోన్‌ చేతిలో ఉండాలి లేకుంటే ఛార్జింగ్ ఉండాలి అన్నట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల వస్తువులు దెబ్బతినడమే కాదు.. ఒక్కోసారి మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎన్నో వార్తలు వచ్చాయి.. ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగా పేలి గాయలపాలయ్యారు అని..కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news