అందాల చందమామ కాజల్ అగర్వాల్..పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ విదితమే. అతనికి ‘నీల్ కిచ్లు’ అని నామకరణం చేసింది. పెళ్లి తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని పంచదార బొమ్మ డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, డెలివరీ తర్వాత కాజల్ తన భర్త, తనయుడితో కలిసి తొలిసారి వెకేషన్ కు వెళ్లింది.
గోవాకు వెళ్లి అక్కడ హ్యాపీగా తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తన చెల్లెలు నిషా అగర్వాల్ కుటుంబంతో గోవాకు వచ్చిన కాజల్..ఈ సారి తన ఫ్యామిలీతో వెళ్లింది. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా కాజల్ ఫ్యామిలీ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమించింది. తన కొడుకు నేల్ కిచ్లూ, భర్తతో కలిసి ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.
Kajal Aggarwal with her family clicked at the airport!!#elite #eliteshowbiz #kajalaggarwal #airport pic.twitter.com/dGVt0lEEmd
— Elite (@EliteShowbiz) October 8, 2022