అరకు ఎంపీ మాధవి ల‌వ్ స్టోరి…

-

ప్రేమకు ఆస్తులు అంతస్తులు కులాలు మతాలు అవసరంలేదు. ప్రేమించుకోవటానికి రెండు హృదయాలు ఒక్కటైతే చాలు. వివాహం చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఒకటి అయితే చాలు. ఇప్పుడు అర‌కు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి తన ప్రేమికుడు అయిన‌ కుశిరెడ్డి శివప్రసాద్ ను గురువారం రాత్రి కొయ్యూరు మండలంలోని శరభన్నపాలెం లో వివాహం చేసుకోనున్న‌ సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అతి చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికైన మాధవి రికార్డు సృష్టించారు.

ఇక మాధవి ప్రేమ చిగురించి అది పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అన్నది తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు మనకు ఆమె ప్రేమ కథ లో కనిపిస్తాయి. మాధవికి కాబోయే భర్త శివ ప్రసాద్, మాధవి-శివ‌ప్ర‌సాద్‌ 16 సంవత్సరాలపాటు స్నేహితులుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో మాధవికి సాయం చేసేందుకు శివప్రసాద్ ఆమె వెనకే ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారం సమయంలోనే స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పడంతో వారు మాధవి, శివప్రసాద్ వివాహానికి అంగీకరించారు. ఇక మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేవుడు రద్దయిన చింతపల్లి నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక మాధవి తండ్రి దేవుడుకు, శివప్రసాద్ తండ్రి నారాయణమూర్తి మధ్య కూడా స్నేహం ఉంది. అలా స్నేహితుల పిల్లల ఇప్పుడు ప్రేమికులు అయ్యి పెళ్లి చేసుకుంటున్నారు. శివప్రసాద్, మాధవి ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో తన స్నేహితురాలికి అరకు ఎంపీ సీటు రావడంతో ఆమె ప్రచారం కోసం వచ్చిన శివప్రసాద్ ఆమె మనసును దోచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మనసులు కలవడంతో వీరు వివాహ బంధంతో ఒకటవుతున్నారు.

వీరి వివాహం గురువారం రాత్రి 3 గంటల 15 నిమిషాలకు శ‌ర‌భ‌న్న‌పాలెంలో జరగనుండగా, వీరి రిసెప్షన్ 18వ తేదీన అక్క‌డే జరగనుంది. అయితే పార్టీ నేత‌ల‌కు వైజాగ్‌లోని రిషికొండ‌లో పార్టీ నేత‌ల‌కు మ‌రోసారి రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఏదేమైనా 25 సంవత్సరాలకే అతి పిన్న వయసులో ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించిన మాధవి ఎంపీ హోదాలో పెళ్లి చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news