హైదరాబాద్ లో గబ్బిలాలు అంతరించిపోతున్నాయా…?

-

ఇప్పుడు ప్రపంచం మొత్తానికి శత్రువు ఒక్కటే… గబ్బిలం. అది ఉండేది పావు కేజీ కూడా కాదు. కాని దాని వలన వచ్చింది అని భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది కరోనా వైరస్ బారిన పడి నరకం చూస్తున్నారు. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం గబ్బిలం.

మన దేశంలో గబ్బిల౦ నుంచి యాక్ అంటారు.కాని చైనాలో లోట్టలెసుకుని తినే పరిస్థితి ఉంటుంది. అందుకే మన దేశంలో గబ్బిలం కనపడితే చంపుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మనం ఎన్టీఆర్ పార్క్ వద్ద బండి పార్క్ చేసిన సమయంలో వేల గబ్బిలాలు చెట్లకు వేలాడుతూ ఉంటాయి. హైదరాబాద్‌లో 16 రకాల గబ్బిలాలు ఉంటున్నాయి. అవి చెట్లపై, భవనాలు, గుహలు, చెట్ల తొర్రల్లో జీవిస్తున్నాయి.

హైదరాబాద్ ప్రజలు పనిగట్టుకొని గబ్బిలాలను చంపకపోయినా సిటీలో ఎక్కువగా పెరిగిన స్ప్రేల వాడకం, పురుగు మందుల వాడకం, బ్లీచింగ్ వాడకం వంటివి గబ్బిలాలకు శాపంగా మారాయని అర్ధమవుతుంది. గబ్బిలాలు ఎక్కువగా ఇప్పుడు అంతరించిపోతున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాటికి ఆహరం దొరకడం లేదు. ఎక్కడైనా కుక్కలు గాని ఏదైనా జంతువులు చనిపోతే వాటిని ఇవి తింటున్నాయి.

హైదరాబాద్ లో ఇప్పుడు చాలా మంది గబ్బిలాలను టార్గెట్ చేసారు. తమ ఏరియాల్లో ఏ చెట్లపైనైనా గబ్బిలాలు కనిపిస్తే చాలు… ఎండు పుల్లలు, కాగితాలు పోగేసి చెట్టు కింద మంట పెడుతున్నారు. ఆ పొగకు ఊపిరాడక అవి చనిపోతున్నాయి. హైదరాబాద్ మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు. అయితే గబ్బిలాలు పర్యావరణం కాపాడే విషయంలో చాలా వరకు ముందు ఉంటాయి. చనిపోయిన జంతువులను అవి తినడంతో వాటి దుర్గందాల వలన వచ్చిన కాలుష్యం పెద్దగా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news