మీ పిల్లలు అశ్లీలానికి అడిక్ట్ అవుతున్నారా…

-

ఆన్ లైన్ లో చాలా పోర్న్​ వెబ్​ సైట్​ లు ఉన్నాయి. వాటిల్లో పోర్న్​ కంటెంట్​ కోకొల్లలుగా ఉంది. మరియు ఇది ఇంటర్నెట్​ వాడే పిల్లలకు కేవలం క్లిక్​ దూరంలోనే ఉంది. ఇంటర్నెట్​ వాడే పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. వారు పోర్న్​ వెబైసైట్లకు అడిక్ట్​ కాకుండా చూసుకోవాలి. ముంబైకి చెందిన సైకోథెరపిస్ట్ మరియు కౌన్సిలర్ తనూ చోక్సీ దీని గురించి మాట్లాడుతూ… పిల్లలు(Children) పోర్న్​ చూడకుండా ఎలా కట్టడి చేయాలో పలు సూచనలు చేసింది. అవేంటంటే….

 

కరోనా కారణంగా వచ్చిన ఆన్​ లైన్​ క్లాసులు వల్ల అందరు చిన్నారులకు స్మార్ట్​ ఫోన్​ తప్పనిసరయిందని, ఇంటర్నెట్​ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటి దని పేర్కొంది. దీని వల్ల కలిగే లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలు కూడా అంతే సంఖ్యలో ఉంటాయని వివరించింది. పోర్న్​ వినియోగం ప్రస్తుత రోజుల్లో అధికంగా ఉందని తెలిపింది. ఓ నివేదిక ప్రకారం అమోజాన్​, నెట్​ ఫ్లిక్స్​, ట్విటర్​ కన్నా ఎక్కువగా పోర్న్​ సైట్లు బ్రౌజ్​ చేస్తున్నారట నెటిజన్లు. మనం పూర్తిగా ఈ పోర్న్​ ను కట్టడి చేయలేకపోయినా మన పిల్లలు ఈ అశ్లీల కంటెంట్​ చూసి చెడిపోకుండా జాగ్రత్త పడాలి. దీని కోసం మనం మన పిల్లలు ఎంత సేపు ఇంటర్నెట్​ వాడుతున్నారనే దాని మీద ఓ కన్నేసి ఉంచాలి. ఇంటర్నెట్​ వాడకం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే వారిని అనుమానించాలి. తల్లిదండ్రులు తరుచూ వారు ఏం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. వారి గ్యాడ్జెట్లను మనకు అనుసందానించుకోవాలి.

మీ పిల్లలు తరుచూ ఇలా చేస్తుంటే వారిని అనుమానించాలి.

ఏదైనా పనులు చెబితే చేయకపోవడం, తరుచూ కసురుకోవడం, స్కూలు, కాలేజీ లల్లో చెప్పిన వర్క్​ కంప్లీట్​ చేయలేకపోవడం ఊరికే చిరాకు పడుతుండడం.పిల్లలతో తరుచూ స్నేహంగా ఉండడం వలన వారు పోర్న్​ సైట్లకు వైపు తమ మనసును మళ్లించరు. వారు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు, భవిష్యత్​ లో ఏం చేయాలనుకుంటున్నారనే దాని గురించి తెలుకోవాలి. వారితో కలివిడిగా మెదులుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు పోర్న్ చూసినా కూడా వారిని ఎగతాళి చేయడం మానేయాలి. దానిని ఓ పెద్ద తప్పుగా చూపుతూ వారిని తిట్టకూడదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్​ లో ఎలా నాశనమవుతారో చెప్పాలి. ఒంటరితనం వారిని పోర్న్​ వైపు మళ్లిస్తుంది. వారికి ఏది మంచి ఏది చెడు అనే విషయాలు చెబుతూ… జాగ్రత్తలు పాటించాలి.

Read more RELATED
Recommended to you

Latest news