బ్రేక్‌ఫాస్ట్‌గా ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? అస్సలు మంచిది కాదట..!!

-

తినే బ్రేక్‌ ఫాస్ట్‌ మన ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపెడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ను కడుపునిండా తీసుకుంటే.. ఆ రోజంతా యాక్టీవ్‌గా పని చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు బ్రేక్‌ ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తారు. ఇలా చేస్తే మీరు ఎప్పటికీ బరువు తగ్గలేరు. ఎందుకంటే.. ఉదయం ఎక్కువగా తినాలి.. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి.. నైట్‌కి ఇంకాస్త తక్కువ తినాలి. ఇలా తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. హెల్తీగా బరువు తగ్గొచ్చు. అయితే తినమన్నారు కదా అని పూరీలు, పరోటాలు, బోండాలు లాంగిచేస్తే అంతే..! బ్రేక్‌ఫాస్ట్‌లో ఇప్పుడు చెప్పుకోబోయే ఐదింటిని అస్సలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.. అవేంటో ఎందుకో వద్దో చూద్దామా..!

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం మానేయాలి. ప్రాసెస్ చేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే నూనె, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చిప్స్, పాప్‌కార్న్ వంటి వాటిని పొద్దున్నే అస్సలు తినొద్దు

కేక్స్‌- పిండి, చక్కెర అధికంగా ఉండే కేకులను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ పదార్థాలన్నీ శరీరానికి చాలా హానికరం. అల్పాహారం కోసం రొట్టె, కూర లేదా పండ్లను తినడం ఉత్తమం.

పూరి పరోట- ఇవి బానే ఉన్నప్పటికీ.. నూనెలో స్నానం చేసి మరీ వస్తాయి కాబట్టి…పొద్దుపొద్దునే ఇంత హెవీ ఫుడ్స్‌ అంత మంచివి కావు. ఇవి తిని ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే ఉంటుంది..చుక్కలు కనిపిస్తాయ్ అంతే.

నూడుల్స్‌- పొద్దున్నే ఇవి తినే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. వీటిని కూడా అస్సలు ఉదయం తినొద్దు అంటున్నారు వైద్య నిపుణులు.

ఫ్రూట్‌ జ్యూస్‌- మార్కెట్‌లో దొరికే పండ్ల రసాలు తాగడం మంచిదని చాలామంది గట్టి నమ్మకం. కానీ ఇది అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ రసంలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. ఇది మీ బరువును పెంచుతుంది. దీని బదులుగా ఇంట్లో తయారుచేసిన తాజా రసం తీసుకోండి. లేకపోతే పండ్లను తినండి. ఇవి చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. మరియు ఇందులో చక్కెర ఉండదు.(ప్రతీకాత్మక చిత్రం)

సో..వీటిని ఉదయం అస్సలు తీసుకోవద్దు..వీటికి బదులుగా స్ప్రౌట్స్‌, కూరగాయ ముక్కలు, పాలిష్‌ పట్టన పప్పుతో చేసిన ఇడ్లీ, దోశ, ఓట్స్‌ లాంటివి తీసుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news