సాయంత్రం పూట టీ తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

చాలా మంది రోజు కి నాలుగైదు సార్లు టీ తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం పూట టీ తాగుతూ ఉంటారు. సాయంత్రం పూట మీరు కూడా తాగుతూ ఉంటారా అయితే కచ్చితంగా ఈ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సాయంత్రం వేళ టీ తాగితే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది..?, ఏ సమస్యలు వస్తాయి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం, చాలామంది సాయంత్రం పూట టీ తాగుతూ ఉంటారు. కానీ రాత్రి నిద్ర పోవడానికి పది గంటలు ముందు వరకు కెఫీన్ అసలు తీసుకోకూడదు.

డిహైడ్రేషన్ సమస్య:

సాయంత్రం పూట మోతాదుకి మించి టీ ని తీసుకోవడం వలన డిహైడ్రేషన్ సమస్య వస్తుంది,

మెదడుపై ఎఫెక్ట్:

టీ లో కెఫీన్ అధికంగా ఉండడం వలన ఇది మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది దీనితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

యాసిడ్ రిఫ్లెక్ సమస్య:

రోజుకి ఐదు నుండి పది కప్పుల టీ తాగడం వలన ఆసిడ్ రిఫ్లెక్స్ ప్రమాదం ఉంది. ఛాతి లో మంట వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

శాకాహార్లు టీ కి దూరంగా ఉండాలి:

శాకాహారులు టీ కి వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే ఇది వారి యొక్క ఆరోగ్యం పై మరింత ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఐరన్ సమస్య:

రోజుకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు టీ ని తాగే వారిలో ఐరన్ శోషణ సామర్థ్యం తగ్గుతుంది.

ఈ సమస్యలు ఉన్నవారు టీ తీసుకోవద్దు:

బరువు తక్కువగా ఉన్న వాళ్ళు టీ కి దూరంగా ఉండాలి.
అదేవిధంగా జుట్టు రాలిపోతున్న వాళ్ళు టీ కి దూరంగా ఉండాలి.
చర్మ సమస్యలు వున్నా కూడా టీ కాఫీలకి దూరంగా ఉండటం మంచిది.
అలానే ఆసిడిటీ గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు సాయంత్రం పూట టీ తీసుకోవడం మంచిది కాదు. జీర్ణవ్యవస్థపై ఇది నెగటివ్ ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి టీ తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని టీ తీసుకోండి లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news