మీ వయస్సుకి తగినంత సేపు నిద్రపోతున్నారా..? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే..?

-

ఆరోగ్యానికి పౌష్టికాహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కనుక ప్రతి ఒక్కరూ తగినంత సేపు నిద్ర పోవాలి. సరిగ్గా నిద్ర పోవాల్సినంత సేపు నిద్ర పోతే ఆరోగ్యం బాగుంటుంది లేదంటే లేని పోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నీరసం, ఎనర్జీ లెవల్స్ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే నిద్ర సరిగ్గా లేకపోతే టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలు, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు 11 నుండి 14 గంటల సేపు నిద్ర పోవాలి.

అదే పెద్ద వాళ్ళు అయితే 7 నుండి 9 గంటల నిద్ర పోవాలి. ఇలా ఎవరి వయసుని బట్టి వాళ్ళు నిద్ర పోవడం అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నిద్ర లేకపోతే ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాలి. కాబట్టి నిద్ర పట్ల కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి.

రాత్రిపూట సరిగా నిద్ర పట్టాలంటే ఈ విధంగా అనుసరించండి:

ఉదయంపూట నిద్ర పోవడం మానుకోండి.
కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా సాయంత్రం పూట కెఫిన్ తీసుకోకండి.
రోజులో మీరు పుస్తకం చదవడం రిలాక్స్ గా ఉండే పాటలు వినడం వంటివి చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది.
రాత్రి నిద్ర పోవడానికి మూడు గంటల ముందే వ్యాయామాలు చేసుకోండి. నిద్రకు వ్యాయామానికి కనీసం మూడు గంటల పైగా గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి.
బెడ్రూంలో టీవీని ఉంచుకోకండి కేవలం నిద్ర పోవడానికి మాత్రమే బెడ్ రూమ్ ఉపయోగించండి.
బెడ్ రూమ్ కూల్ గా చీకటి గా ఉండేటట్లు చూసుకోండి. ఇలా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

ఏ వయసు వాళ్ళు ఎంత సేపు నిద్ర పోవాలి..?

1 నుండి 2 ఏళ్ళ వయసు వాళ్ళు 11 నుండి 14 గంటలు నిద్ర పోవాలి.
మూడు నుండి నాలుగు ఏళ్ళు వాళ్ళు 10 నుండి 13 గంటలు నిద్ర పోవాలి.
6 నుండి 13 ఏళ్ల వాళ్ళు 9 నుండి 11 గంటలు నిద్ర పోవాలి.
14 నుండి 17 ఏళ్ల వయసు వాళ్ళు 8 నుండి 10 గంటలు నిద్ర పోవాలి.
18 నుండి 60 ఏళ్ల వయసు వాళ్ళు 7 నుండి 9 గంటలు.
60 ఏళ్లు దాటిన వాళ్ళు 8 గంటలు నిద్ర పోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version