వేడి అవుతుందని మామిడి పండ్లు తినడం మానేస్తున్నారా? ఒక్కసారి ఇది తెలుసుకోండి.

-

వేసవి వచ్చింది. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా మామిడి పండ్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. తినాలని బాగా కోరికగా ఉంది. కానీ తినలేకపోతున్నాం. కారణం వేడి.ప్రతీ రుతువులో దానికి సంబంధించిన ప్రత్యేకమైన పండ్లని ప్రకృతి అందిస్తుంటుంది. ఆ రుతువులో వాటిని తినాలని చెబుతుంటారు. ఒక్కో కాలంలో ఒక్కో పండుని తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఐతే వేసవిలో అందరూ ఇష్టపడే మామిడి పండ్లని కొందరు తినలేరు. లావు పెరుగుతామనో, వేడి అవుతుందనో, తినాలని కోరికగా ఉన్నా వద్దని మనసు చంపుకుంటారు.

మరి వాళ్లనుకుంటున్నట్టు మామిడి పండ్లని తినడం వల్ల వేడి పెరుగుతుందా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

నిజానికి మామిడి పండ్లని తినడం వల్ల మాత్రమే వేడి పెరుగుతుందనేది కరెక్ట్ కాదు. వేసవిలో మన శరీరంలో ఉన్న నీటిశాతం బాగా తగ్గుతుంది. సూర్యుడు పై నుండి అంతకుముందు లేనంత ఎండని కురిపిస్తుంటాడు కాబట్టి మనలో నీటిశాతం ఆవిరైపోతుంది.

శరీరంలో నీటిశాతం తగ్గడం వల్లే వేడి పెరుగుతుందని తెలుసుకోండి. అందువల్ల శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తే వేడి తగ్గుతుంది. మనలో నీరు ఆవిరి అవకుండా నీటిని అందిస్తూ ఉంటే శరీరం వేడి చేయడం జరగదు. అప్పుడు మామిడి పండ్లని మీరు తినవచ్చు. అంటే శరీరంలో వేడికి కారణం నీటిశాతం తగ్గడమే కానీ పండ్లు తినడం ఒక్కటే కారణం కాదని గుర్తించండి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తినడం ఎప్పుడూ అనర్థమే. అందుకే కావాల్సినంత మాత్రమే తీసుకోవాలి. ఈ విషయం గుర్తుంచుకుని శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు అందిస్తూ, మీకు నచ్చిన మామిడి పండుని ఆహారంగా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version