ఎల్‌ఐసీ ‘బీమా జ్యోతి’ పాలసీ.. ఎఫ్‌డీల కంటే ఇందులో వడ్డీరేటు ఎక్కువ..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఇటీవల ‘బీమా జ్యోతి’ అనే కొత్త పాలసీని ప్రారంభించింది. పన్ను రహిత రాబడితోపాటు ఈ స్కీం ద్వారా చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వ్యక్తిగత, పరిమిత ప్రీమియం చెల్లింపులు, జీవిత బీమా పొదుపు ప్రణాళిక వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీంలో చేరిన పాలసీదారుడికి పొదపుతోపాటు రక్షణ కూడా కల్పిస్తుంది. ఇందులో పాలసీదారుడు ఒకే సారి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ స్కీంలో చేరిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే.. అతడికి నామినిగా ఉన్న వ్యక్తికి పాలసీ డబ్బులు అందజేస్తారు.

ఎల్ఐసీ – బీమా జ్యోతి

ఈ స్కీంలో చేరిన తర్వాత సంస్థ వినియోగదారుడికి ప్రతి ఏడాది చివరికి రూ.1000కి రూ.50 అదనంగా చెల్లిస్తుంది. దీంతోపాటు బోనస్ సదుపాయం కూడా ఉంది. అయితే కనీసం రూ.లక్ష వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ స్కీంకు అర్హులు. 15-20 ఏళ్ల వరకు బీమా జ్యోతి పాలసీని కొనసాగించవచ్చు. అయితే బీమా జ్యోతి పాలసీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలసీదారుడు 15 ఏళ్లకు సంబంధించిన ప్యాకేజీని సెలక్ట్ చేసుకున్నప్పుడు.. 10 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. 16 సంవత్సరాలకు తీసుకున్నప్పుడు 11 ఏళ్ల ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస మొత్తం రూ.1-25 వేల వరకు జమ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా డబ్బులు జమ చేసుకోవచ్చు.

సాధారణంగా దేశంలోని చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల తక్కువ వడ్డీరేటును కల్పిస్తున్నాయి. వీటి కంటే ఈ పాలసీలో వడ్డీ రేటు ఎక్కువగా లభిస్తోంది. దాదాపు 7.215 శాతం వడ్డీరేటు కల్పిస్తోంది. 15 ఏళ్ల పాలసీకి 10 సంత్సరాల ప్రీమియం చెల్లిస్తే.. మొత్తం ప్రీమియం 82,545 అవుతుంది. మెచ్చూరిటీ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం రూ.50 వేలు వస్తుంది. మొత్తంగా 7.50 లక్షలు వస్తాయి. అంటే 10 లక్షల పాలసీపై మెచ్చూరిటీ కాలపరిమితి ముగిసే నాటికి మొత్తంగా రూ.17.5 లక్షలు లభిస్తాయి. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. పాలసీ బ్యాక్ డేటింగ్ సౌకర్యం కూడా కలదు. పాలసీ కాలంతో పోల్చితే 5 సంవత్సరాల తక్కువ ప్రీమియం చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version