హై హీల్స్ కొనడానికి వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి.

-

అమ్మాయిలు హై హీల్స్ కొనడానికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ఒకానొక కారణం తక్కువ ఎత్తుగా ఉన్నామనే. ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు హైట్ గా కనిపించడానికి హై హీల్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే మరికొంత మంది తమ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయన్న నమ్మకంతో హై హీల్స్ వేసుకుంటారు. ఐతే ఎవరు ఏ కారణంగా హై హీల్స్ ధరించినా, దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హై హీల్స్ కొనేటపుడు సరిగ్గా ఎంచుకోకపోతే ఆ తర్వాత ఎందుకు కొన్నామన్న బాధ పడాల్సిన అవసరం ఉండదు.

మీ పాదానికి సరిగ్గా సరిపడా కొలతలున్న హై హీల్స్ మాత్రమే కొనండి. కొనేటపుడు ఖచ్చితంగా ఒకసారి ధరించి చూడండి. మీకు కావాల్సిన వాళ్ళనెవరినో హై హీల్స్ తీసుకురమ్మని చెప్పవద్దు. మీ పాదానికి ధరించకుండా హై హీల్స్ వేసుకుంటే చికాకు కలిగి ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, హై హీల్స్ కొనాలనుకున్నవారు పగటి పూట మాత్రమే కొనండి. సాయంత్రం వరకు మన పాదాలు నార్మల్ కంటే కొంత ఉబ్బుతాయి. దానివల్ల మన పాదాలకి సరిపడా కొలత మ్యాచ్ కాకపోవచ్చు. అందుకే ఎప్పుడు హై హీల్స్ కొన్నా పగటి పూట మాత్రమే కొనండి.

హీల్ క్యాప్ ఉన్న హై హీల్స్ వాడడం ఉత్తమం. నడవడానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కాదు నడిచేటప్పుడు చప్పుడు రాకుండా ఉంటుంది. మీ నడక అవతలి వాళ్ళకి తెలియకుండా ఉండాలనుకుంటే హీల్ క్యాప్ ఉన్న వాటినే ధరించండి. ఇంకా హీల్ క్యాప్ ఉన్న హై హీల్స్ ని కొనడం వల్ల మడమ వద్ద ఎర్రగా అయ్యి, చిరాకు రాకుండా ఉంటుంది. సో, హై హీల్స్ కావాలనుకునే వారు వీటిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news