బీజేపీకి జనసేన షాక్.. ఆ దూరం దేనికి సంకేతం ?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నిక ముందు బీజేపీకి టెన్షన్ పట్టుకుంది. దానికి కారణం జనసేన కేడర్ అయోమయంలో ఉండడమే. నిజానికి ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామని జనసేన – బీజేపీలు ఉవ్విళ్ళూరాయి. ఎట్టకేలకు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విషయంలో జనసేన సైలెంట్ గా ఉంటుందని అన్నారు. ఎన్నికల రెండు అంచెల వ్యవస్థతో కమిటీలు వేసింది.

కానీ ఇప్పటి వరకు ఉప ఎన్నికలకు జనసేన మాత్రం ఇన్ చార్జ్ లను ప్రకటించలేదు. ఈరోజు ఆర్డీవో కార్యాలయం వద్ద ఇసుక పాలసీకి వ్యతిరేకంగా బిజెపి ధర్నా చేపట్టింది. అయితే ఈ ధర్నాకి జనసేన దూరంగా ఉన్నట్లు చేబుతున్నారు. అసలు ఉప ఎన్నికల వ్యూహం ఏంటో కూడా జనసేన బయట పడడం లేదు. అలాగే ప్రచారంపై కూడా ఇప్పటి దాకా క్లారిటీ రాలేదని అంటున్నారు. దీంతో బీజేపీ టెన్షన్ లో ఉందని అంటున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...