ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది అక్కడేనా

-

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోవడం పై బీజేపీలో అంతర్మధనం నడుస్తుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం.. అధికారంలోకి వచ్చేస్తున్నాం అని ప్రకటన చేసిన బీజేపీ నేతలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త షాక్ కి గురి చేశాయి. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సిట్టింగ్ సీటు కోల్పోవడం పై దృష్టి పెట్టారు కాషాయ పార్టీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎక్కడ దెబ్బతిన్నది అన్న దాని పై పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో పార్టీ పరిస్థితి అటు ఇటుగా ఉన్నా సిట్టింగ్ సీటు ఖచ్చితంగా నిలబెట్టుకుంటామన్న ధీమాలో ఉన్నారు బీజేపీ సీనియర్ నేతలు. అయితే అధికార పార్టీ వ్యూహాన్ని.. బరిలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల బలాన్ని అంచనా వేయలేకపోయారు.

దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల మాదిరే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని ఆశించారు పార్టీ నేతలు కానీ అందుకు తగ్గ వ్యూహాన్ని మాత్రం రూపొందించడంలో ఫెయిల్ అయ్యారు. రామచంద్రరావు మళ్లీ ఎమ్మెల్సీ అవుతారని ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో దిగినా విజయం మాత్రం తమదే అన్న అతి ధీమా సైతం విజయకాశాలను దెబ్బతీసింది.

నిరుద్యోగులు,ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత గెలిపిస్తుందని..పార్టీ పై ఉన్న అనుకూలత కలిసి వస్తుందని ప్రచారంపై పెద్దగా శ్రద్ధపెట్టలేదన్న విషయాన్ని ఇప్పుడు గ్రహించారట. ఓటర్లను కలవలేదు.. బీజేపీకి ఓటేయమని కోరలేదు. పేరుకి 25 మంది ఓటర్ల కు ఒక నేతతో కో ఆర్డినేషన్ కమిటీ వేసినా పోల్‌ మేనేజిమెంట్‌ అంశంలో బీజేపీ చేతులు ఎత్తేయడం వల్లే సీటు కోల్పోయమని పార్టీ శ్రేణులు తేల్చాయట.

ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని చావోరేవో అన్నట్టుగా వర్క్‌ చేస్తే.. ఆ స్థాయిలో బీజేపీ పోరాటం చేయలేదని గుర్తించారట. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు క్షేత్రస్థాయిలో పార్టీ వ్యూహం ఎలా ఉండాలో వ్యూహ రచన చేయలేదని చెబుతున్నారు. అలాగే గ్రేటర్‌ ఎన్నికల్లో చూపెట్టని డబ్బు ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపెట్టదని అనుకోవడం పార్టీ పుట్టి ముంచిందని నేతలు నిట్టూరుస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news