శుభ్రత విషయంలో చాలా మంది చేసే తప్పులు మీరూ చేస్తున్నారా..?

-

మనకి తెలియకుండా ఏదో ఒక తప్పుని చేస్తూ ఉంటాము. అయితే తప్పు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకనే ప్రతిదీ కూడా మంచి పద్ధతి అయి ఉండాలి. ముఖ్యంగా శుభ్రత విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అటువంటి వాటిని మీ దరి చేరకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా మంచి పద్ధతులని అనుసరించాలి. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

 

మేకప్ వేసుకుని నిద్రపోవడం:

చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుని వెళ్లారు. వచ్చిన తర్వాత బాగా అలసిపోయి దానితో నిద్రపోతారు. కానీ ఈ తప్పు చేయడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ఎంత ఆలస్యమైనా సరే రాత్రి నిద్ర పోయే ముందు మేకప్ తొలగించి నిద్ర పోవడం మంచిది.

మీ మేకప్ ప్రొడక్ట్స్ ఇతరులతో పంచుకోవడం:

మీరు ఉపయోగించే మేకప్ సామాన్లని ఇతరులు ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వంటివి వాళ్ళకి చేరుతాయి. అందుకని ఎప్పుడూ మేకప్ ప్రోడక్ట్స్ ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.

ఒకే బ్రష్ ని ఎక్కువరోజులు వాడడం:

ఒకే టూత్ బ్రష్ ని ఎక్కువ రోజులపాటు వాడడం వల్ల సమస్యలు వస్తాయి. కనుక రెండు నుండి మూడు నెలలుకి మీయొక్క టూత్ బ్రష్ ని మార్చేయాలి. అదేవిధంగా రోజుకి రెండుసార్లు పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. ఇలా చేస్తే దంత సమస్యలు రావు.

వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేయకపోవడం:

వ్యాయామం చేసినప్పుడు చాలా చెమట పడుతుంది. బ్యాక్టీరియా మరియు క్రిములు పేరుకుపోతాయి. కాబట్టి వర్క్ ఔట్ చేసిన తర్వాత మంచిగా స్నానం చేయాలి లేదు అంటే బ్యాక్టీరియా మరియు క్రిముల వల్ల సమస్యలు వస్తాయి.

కాలి గోర్లని పూర్తిగా కత్తిరించడం:

చాలామంది కాలి గోరులని బాగా పొట్టిగా కత్తిరిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల నడవడం కష్టం అవుతుంది. అలాగే ఒత్తిడి కూడా వేళ్ళపై పడుతుంది. కాబట్టి బాగా పూర్తిగా కత్తిరించద్దు.

వీటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం:

రోజూ ఉపయోగించే టీవీ రిమోట్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ వంటి వాటికి దుమ్ము పడుతుంది వాటిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి. లేదంటే కోల్డ్ వైరస్ కి దారి తీస్తుంది. దుమ్ము పడని వాళ్ళకి మరింత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేస్తూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news