T20 WORLD CUP : నేడు స్కాట్లాండ్‌తో టీమిండియా ఢీ

-

టీ 20 ప్రపంచ కప్‌ లో భాగంగా… ఇవాళ టీమిండియా మరియు స్కాట్లాండ్‌ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోని ఇంటర్నేషనల్‌ స్టేడియం లో జరుగుతోంది. నువ్వా – నేనా అన్నట్లు సాగే ఈ మ్యాచ్‌… ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ రెండు జట్లల్లో స్కాట్లాండ్‌ కంటేనూ… టీమిండియా కాస్త బలంగా కనిపిస్తోంది.

మొన్న అఫ్ఘనిస్తాన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో గెలిచిన టీమిండియా పూర్తి.. ఆత్మ విశ్వసంతో కనిపిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేస్తేనే.. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. కానీ అది అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే.. స్కాట్కాండ్‌ జట్టు చాలా బాగా ఆడుతోంది. ఇక ఇది ఇలా ఉండగా… ఇవాళ నమీబియా మరియు న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరో మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ ఓడితే…. టీమిండియా అడ్వాంటేజ్‌ అవుతుంది.సెమీస్‌ ఆశలు మెరుగు అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news