చాలా మంది పాటలని వినడానికి ఫోన్ మాట్లాడడానికి ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఇయర్ ఫోన్స్ వల్ల చాలా రకాల ఇబ్బందులన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వలన ఎలాంటి సమస్యలు తప్పవు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.
హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్ వంటి వాటి వలన ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినికిడిని కోల్పోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు. చాలా మంది ఇయర్ ఫోన్‌లలో 105 dB వాల్యూమ్ వరకు ఉంటున్నారట. ఇలా వినడం చెవులకు అస్సలు మంచిది కాదు. ఇది చాలా ప్రమాదకరం అని అధ్యయనాలు అంటున్నాయి.
సౌండ్ 60 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉంటే చాలా ప్రమాదం. దీని వలన వినికిడి లోపం కలిగే ఛాన్స్ ఉందిట. ఒకవేళ కనుక ఇది 85 దాటితే అప్పుడు సమస్య వస్తుంది. మీ చెవులకి ఎలాంటి సమస్య రాకుండ మీరు జాగ్రత్తగా పడాలి అంటే సెట్టింగ్స్‌ని 50 శాతం ఉంచుకోండి అదే మంచిది. అయితే ఇలాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలంటే ఇయర్ ఫోన్స్ ని కాకుండా హెడ్ ఫోన్స్ ని వాడండి. హెడ్ ఫోన్స్ పెద్దగా ఉండి చెవులని కప్పుతాయి కానీ చెవిలోకి వెళ్లవు. సో వీటిని వాడడం బెస్ట్. సమస్యలు వుండవు.