చాలా మంది పిల్లలకి పక్క తడిపే అలవాటు ఉంటుంది. పెద్ద అవుతున్న సరే ఇంకా పక్క తడుపుతూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇంకా పక్క తడుపుతున్నారా..? ఆ అలవాటు నుండి బయట పడేయాలని చూస్తున్నారా అయితే ఇలా చేయడం మంచిది. ఇలా కనుక మీరు అనుసరించారంటే పక్క తడిపే అలవాటు నుండి బయటపడడానికి అవుతుంది.
మీ పిల్లలు కి నిద్రపోయే ముందు లిక్విడ్స్ ని ఇవ్వకండి:
నిద్రపోవడానికి గంట ముందు వరకు మాత్రమే ఇవ్వండి. నిద్రపోవడానికి గంట ఉంది అనుకుంటే అప్పుడు ఎటువంటి ద్రవపదార్థాలని వాళ్ళకి ఇవ్వకండి.
వాష్ రూమ్ కి తీసుకు వెళ్ళండి:
అలానే మీ పిల్లలు మంచం మీదకి వెళ్లేటప్పుడు ఒకసారి వాష్ రూమ్ కి తీసుకువెళ్లండి ఇలా చేయడం వలన పక్కతడిపే అలవాటు మానడానికి అవుతుంది. అలానే వాళ్ళు నిద్రపోయిన మూడు గంటల తర్వాత మళ్లీ లేపి వాష్ రూమ్ కి తీసుకు వెళ్ళండి. ఇలా కనుక మీరు రెండు నెలలు క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా ఈ అలవాటు పోతుంది.
జాగ్రత్త సమస్య కూడా రావచ్చు..
ఎక్కువమంది ఆడపిల్లలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ కనుక మీకు ఆ సందేహం కలిగితే డాక్టర్ ని సంప్రదించడం మంచిది పక్కతడిపే అలవాటు నరాలు, వెన్నెముక, కిడ్నీ సమస్యలు ఉండడం వల్ల కూడా వస్తుంటాయి. కాబట్టి ఓసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం కూడా మంచిది లేదంటే బద్ధకం వలన కూడా ఇది వస్తుంది. ఏది ఏమైనా ముందు ఈ చిన్న చిన్న చిట్కాలని పాటించి ట్రై చేయండి ఒకవేళ కనుక పక్కతడపడం మానేసారంటే ఏ బాధ ఉండదు కానీ ఒకవేళ కనుక ఆ అలవాటు వాళ్ళు మానుకోలేదంటే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.