సల్మాన్ ఖాన్ కోసం తన సినిమా పేరు మార్చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ …!?

-

టైటిల్ తోనే సినిమా సగం సక్సెస్ సాధిస్తుందని చాలా సార్లు ప్రూవైంది. టైటిల్ సినిమాను ఏ కోణంలో చూడాలిఅనేది నిర్ణయిస్తుంది . కాబట్టే సినిమావాళ్లు టైటిల్ విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు. అర్జున్ రెడ్డి చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ . ఆయన తన తదుపరి చిత్రం కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ డెవిల్ అనే బయిటకు వచ్చి విశేష ఆదరణ పొందింది .

అయితే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సందీప్ వంగ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు .ఇది క్రైమ్ డ్రామా గ సాగే కథనానికి డెవిల్ అనే పేరు ఖరారు చేశారు .ఐతే ఆ పేరును సందీప్ మార్చేశారు .కారణం ఏంటంటే … డెవిల్ టైటిల్ ని సాజిద్ నాడియాద్ వాలా రిజిస్టర్ చేయించారట. సల్మాన్ నటిస్తున్న `కిక్` సీక్వెల్ కి డెవిల్ టైటిల్ ని ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నారు సాజిద్. కిక్ సినిమాలో సల్మాన్ ఖాన్ `డెవిల్` అనే పేరును ఉపయోగించాడు. దానివల్ల డెవిల్ అన్న పేరు బాగా రిజిస్టర్ అయిపోయింది.
అందుకే ఇప్పుడు ఆ సీక్వెల్ కి ఆ పేరు పెట్టాలనుకుంటున్నారంట .

అయితే రన్బీర్ కపూర్ సినిమా బాగా క్రూరంగా సస్పెన్సు థ్రిల్లర్ గ ఉండటం తో ఆ సినిమా టైటిల్ ని యానిమల్గా మార్పు చేసారంట వంగ. ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి దర్శకత్వం లో అర్జున్ రెడ్డి సంచల విజయాలు సొంతం చేసుకుంది .ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి .అందులో విజయ్ దేవరకొండ ,షాలిని పాండే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు . ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక అర్జున్‌ రెడ్డికి ఫిదా అయిన బాలీవుడ్‌…సందీప్ ని బి టౌన్ కి ఎగరేసుకు పోయింది .

Read more RELATED
Recommended to you

Latest news