‘అర్జున ఫాల్గుణ’ ట్రైలర్‌ రిలీజ్.. ఈసారి థియేటర్లలో మాస్ మరణమే

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే రాజా రాజా చోర అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు.. ఇప్పుడు అర్జునా పాల్గుణ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుండగా… మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ లు ఈ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా మరో బిగ్ అప్డేట్ ను వదిలింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ ట్రైలర్ లో… హీరో విష్ణు తన అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా పూర్తిగా విలేజ్లో సాగినట్లు ట్రైలర్ చూస్తుంటే..మనకు అర్థమవుతుంది. ఇక అటు హీరోయిన్ అమృత అయ్యర్ కూడా… గ్రామ వాలంటీర్ గెటప్ లో చాలా బాగా నటించింది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. కాగా డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.